తెలంగాణ

telangana

ETV Bharat / state

వృక్షవేదం పుస్తకాన్ని చూసి సంతోషం కలిగింది: ఉపరాష్రపతి - ఎంపీ సంతోశ్​ కుమార్ తాజా పర్యటనలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా తీసుకొచ్చిన వృక్షవేదం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు రాజ్యసభ ఎంపీ సంతోశ్​ ​కుమార్ అందించారు. పుస్తకాన్ని శ్లోకాలు, వాటి అర్థాలు, తెలంగాణ ప్రకృతి ఛాయాచిత్రాలతో చక్కగా తీర్చిదిద్దారని ఎంపీని వెంకయ్య అభినందించారు.

mp santosh kumar meet vice president venkaiah naidu for give vruksha vedam book
వృక్షవేదం పుస్తకాన్ని చూసి సంతోషం కలిగింది : ఉపరాష్రపతి

By

Published : Feb 22, 2021, 9:17 PM IST

రాజ్యసభ సభ్యులు సంతోశ్​ కుమార్​ రూపొందించిన వృక్షవేదం పుస్తకాన్ని చూసి తనకెంతో ఆనందం కలిగిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా చెట్లు, మొక్కల ప్రాశస్త్రాన్ని తెలియజేస్తూ తీసుకొచ్చిన ఆ పుస్తకాన్ని ఎంపీ సంతోశ్​ ​కుమార్ ఆయనకు అందించారు.

వృక్షవేదం పుస్తకాన్ని శ్లోకాలు, వాటి అర్థాలు, తెలంగాణ ప్రకృతి ఛాయాచిత్రాలతో చక్కగా తీర్చిదిద్దారని వెంకయ్యనాయుడు అభినందించారు. ఉపరాష్ట్రపతి అభినందన తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఎంపీ సంతోశ్​ కుమార్​ అన్నారు. మాతృభాష, మాతృభూమి పట్ల ఆయన చూపే శ్రద్ధ, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయమకమని పేర్కొన్నారు.పెద్దల ఆశీర్వాదాలతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అత్యున్నత మార్పునకు నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:హైకోర్టు న్యాయవాది దుర్గాప్రసాద్‌ కారును ఢీకొట్టిన లారీ

ABOUT THE AUTHOR

...view details