తెలంగాణ

telangana

ETV Bharat / state

Green India Challenge: 'ఒక్క చెట్టు నాటడం అంటే.. తల్లి ప్రేమను పొందడం లాంటిదే' - ts news

Green India Challenge: మహిళాలోకానికి ప్రత్యేకమైన అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున స్త్రీమూర్తులంతా మొక్కలను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాలు పంచుకోవాలని రాజ్యసభ సభ్యులు సంతోష్​కుమార్​ విజ్ఞప్తి చేశారు. ఒక్క చెట్టు నాటడం అంటే.. తల్లి ప్రేమను పొందడం లాంటిదేనని ఆయన అన్నారు.

Green India Challenge: 'ఒక్క చెట్టు నాటడం అంటే.. తల్లి ప్రేమను పొందడం లాంటిదే'
Green India Challenge: 'ఒక్క చెట్టు నాటడం అంటే.. తల్లి ప్రేమను పొందడం లాంటిదే'

By

Published : Mar 6, 2022, 3:54 PM IST

Green India Challenge: ఒక్క చెట్టు నాటడం అంటే.. తల్లి ప్రేమను పొందడం లాంటిదేనని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు ఎంపీ సంతోష్ అన్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకొని ప్రతి మహిళ ఒక పండ్ల చెట్టును నాటేలా వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రతీ ఒక స్త్రీ మూర్తి మొక్కను నాటి 90003 65000కి సెల్ఫీ ఫొటోను పంపించాలని కోరారు. తన జీవితమంతా నిస్వార్థంగా ఫలాలను అందించే మొక్కలాగే.. ప్రతీ మహిళా త్యాగాలతో కుటుంబాల్ని నిలబెడుతుందని, అచంచలమైన ప్రేమను కురిపిస్తుందన్నారు.

ఈ స్పూర్తికి ప్రతిరూపంగా ప్రతీ త్యాగమూర్తి మొక్కను నాటి తమ ఔన్నత్యాన్ని చాటాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్యులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కోరారు. మొక్కల్ని పెంచడం మనమంతా బాధ్యతగా స్వీకరించినప్పుడే పుడమి పచ్చగా ఉంటుందని, మానవ మనుగడతో పాటు సకల చరాచర జీవులు బతుకుతాయని తెలిపారు. అందుకే మహిళాలోకానికి ప్రత్యేకమైన అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున స్త్రీమూర్తులంతా మొక్కలను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details