రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా రాష్ట్రంలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో రూపొందించిన పుస్తకాన్ని శనివారం ఎమ్మెల్సీ కవితకు అందచేశారు. వృక్ష వేదం పుస్తకం.. పచ్చదనంపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుందని కవిత అన్నారు.
వృక్ష వేదం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంది: కవిత
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ రూపొందించిన వృక్ష వేదం పుస్తకం.. పచ్చదనంపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా రాష్ట్రంలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన వృక్ష వేదం పుస్తకాన్ని సంతోష్ కుమార్ శనివారం కవితకు అందచేశారు.
వృక్ష వేదం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంది: కవిత
రాష్ట్రంలోని అడవులు, ప్రకృతి అందాలను ఎంతో అద్బుతంగా చూపించారని అభినందించారు. పర్యావరణ ప్రేమికులకు ఈ పుస్తకం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. జోగినిపల్లి సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ సభ్యులకు కవిత అభినందనలు తెలిపారు.వేదాల్లో అడవులు, చెట్లకు సంబంధించిన ప్రస్తావనలను తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో ప్రచురించారు.
ఇదీ చదవండి:'సంక్రాంతి తర్వాత ప్రతి గ్రామంలో రైతులతో ముఖాముఖి'