రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగ చేసేందుకు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలను ప్రస్తావిస్తూ తెలంగాణ మార్గదర్శి పేరిట ఈనాడు దినపత్రిక సంపాదకీయం ప్రచురించింది. సంపాదకీయంలో వాస్తవాలను ప్రతిబింబించారని ఎంపీ సంతోశ్ కుమార్ అభినందించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులను క్లుప్తంగా వివరించారని అన్నారు.
ప్రజల ముందుకు నిజాన్ని తీసుకొచ్చిన ఈనాడుకు అభినందనలు
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ పాలనకు ముందు, కేసీఆర్ పాలన తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు నేపథ్యంలో ఈనాడు దినపత్రిక "తెలంగాణ మార్గదర్శి" పేరిట రాసిన సంపాదకీయాన్ని ఉటంకిస్తూ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈనాడు సంపాదకీయానికి ఎంపీ ప్రశంసలు
సాంకేతిక అద్భుతాలుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలను ప్రస్తావిస్తూ... రైతుకు, దేశానికి ఉభయతారకమయ్యేలా సమగ్ర వ్యవసాయ ప్రణాళికపై కేసీఆర్ దృష్టి సారించడాన్ని సంపాదకీయంలో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా అందిపుచ్చుకోవాలన్న చొరవ ఇది అని... రైతు బతుకులో పచ్చదనమే లక్ష్యంగా తెలంగాణ చేస్తున్న సదాలోచన-దేశవ్యాప్త వ్యవసాయ సంస్కరణలకు కరపదీపికగా మారాలని ఈనాడు సంపాదకీయం అభిలషించింది.