ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులకు కేసీఆర్ పరోక్ష సహకారం ఉందని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ వాయిదాకు సీఎం లేఖ రాయడమే దీనికి నిదర్శనమన్నారు. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు తొక్కిపెట్టారుని ప్రశ్నించారు.
ఆ విషయంలో సీఎంను ప్రశ్నించిన ఎంపీ రేవంత్ రెడ్డి - ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన ఎంపీ రేవంత్
సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఏపీలో అక్రమ ప్రాజెక్టులకు కేసీఆర్ పరోక్షంగా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు తొక్కిపెట్టారని నిలదీశారు.
ఆ విషయంలో సీఎంను ప్రశ్నించిన ఎంపీ రేవంత్ రెడ్డి
లక్షా 7 వేల ఎకరాలకు సాగునీరు రాకుండా చేసిన పాపం సీఎందేనని ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి పథకం సామర్థ్యం ఒక టీఎంసీ తగ్గించారని పేర్కొన్నారు. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని కోరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై సుప్రీంలో వేసిన కేసులో పసలేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో వైకాపా కీలక నేతలు వేల కోట్ల పనులు చేస్తున్నారని వివరించారు.
ఇదీ చూడండి :గ్రామ సమస్యలకు వాకీటాకీతో సత్వర పరిష్కారం!