తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి కేటీఆర్​కు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ.. - Hyderabad latest news

మంత్రి కేటీఆర్​కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాలకై దిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తెరాస, భాజపా ఆత్మ ఒక్కటే.. శరీరాలే వేరని అన్నారు.

MP Rewanth Reddy's letter to Minister KTR ..
మంత్రి కేటీఆర్​కు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ..

By

Published : Mar 8, 2021, 8:29 AM IST

తెరాస, భాజపా ఆత్మ ఒక్కటే.. శరీరాలే వేరని ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలప్పుడు కుస్తీ.. ఆ తర్వాత దోస్తీ.. ఏడేళ్లుగా కేసీఆర్​ అదే చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్.. ఉత్తర కుమారుడిలా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

దీక్షకు సిద్ధమా..

కేటీఆర్​కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఐటీఐఆర్, విభజన చట్టంలో హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాల కోసం దిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమా అని సవాల్ చేశారు. తెరాస, భాజపా ఒక్కటి కాకుంటే సవాల్ స్వీకరించాలని కోరారు.

మోదీతో రాజీ..

గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలకు ముందు భాజపాపై కేటీఆర్ తండ్రి యుద్ధం అన్నారు. తర్వాత దిల్లీ వెళ్లి మోదీతో రాజీ పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీపై మళ్లీ యుద్ధం అంటున్నారన్నారని విమర్శించారు. మీరు సవాల్ స్వీకరించకుంటే మోదీ తొత్తులుగా, తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:బడ్జెట్ ప్రతిపాదనలపై శాఖలవారీగా హరీశ్‌రావు సమీక్ష

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details