హైదరాబాద్లో వరద సాయాన్ని కూడా అధికార పార్టీ నేతలు స్వాహా చేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరుకు సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. తెరాస కార్పొరేటర్లు, స్థానిక నాయకులు చూస్తుంటే వీళ్లు మనుషులేనా..? వీళ్లకు మానవత్వం ఉందా అని అనిపిస్తుందని లేఖలో పేర్కొన్నారు.
వరద సాయంపై సీఎం కేసీఆర్కు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాసిన - వరద సహాయం
వరద సహాయంపై సీఎం కేసీఆర్కు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్లో వరద సాయాన్ని కూడా అధికార పార్టీ నేతలు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు.
వరద సహాయంపై సీఎం కేసీఆర్కు లేఖ రాసిన ఎంపీ రేవంత్ రెడ్డి
గ్రేటర్‌లో ఓట్లు దండుకోవాలనే దురుద్దేశంతోనే ఈ కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాల్లో వేయాలని సూచించారు. ఇప్పటి వరకు పరిహారం పంపిణీపై విజిలెన్స్ విచారణ చేయించాలన్నారు. లేదంటే క్షేత్రస్థాయి ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:బాధితులందరికీ తక్షణ సాయం అందిస్తాం: కేటీఆర్