పెన్షన్ అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గించాలని, అర్హులైన వారందరికీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ తీరు ప్రచారం ఎక్కువ పనితనం తక్కువ ఉన్నట్లు ఉందని ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని, రెండోసారి అధికారం ఇస్తే అర్హులందరికి పెన్షన్లు ఇవ్వడంతోపాటు అర్హత వయసును 60 నుంచి 57ఏళ్లకు తగ్గిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి - తెలంగాణ వార్తలు
సీఎం కేసీఆర్‌కు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. పెన్షన్ అర్హత వయసు తగ్గింపు హామీని అమలు చేయాలన్నారు. ఇంట్లో పెన్షన్‌కు అర్హులైన వృద్ధులు ఇద్దరు ఉంటే ఇద్దరినీ పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
రెండేళ్లు పూర్తవవుతున్నా హామీ అమలు విషయంలో ఎలాంటి పురోగతిలేదన్నారు. తక్షణమే పెన్షన్ అర్హత వయసును తగ్గించాలని, ఆర్హులైన అందరికీ పెన్షన్ ఇవ్వాలని, ఇంట్లో ఇద్దరు వృద్ధులుంటే ఇద్దరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2018 తర్వాత భర్తలను కోల్పోయిన ఒంటరి ఆడ బిడ్డలను గుర్తించి తక్షణమే పెన్షన్ ఇవ్వాలన్నారు. కొత్తగా పెన్షన్‌లకు అర్హులను గుర్తించేందుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేయించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి లేదు : కిషన్‌రెడ్డి