హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామన్న మాటను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ మర్చిపోయారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయమాటలు చెప్పి తెరాస అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. పేదలకు ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రకాష్ రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.
'పేదలకు ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారు?' - ఎంపీ రేవంత్ రెడ్డి లేటెస్ట్ న్యూస్
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఆ మాటని మర్చిపోయారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదలకు ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని... సుమేధ ఘటనను గుర్తు చేశారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లో పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్‌లో పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సుమేధ ఘటనను గుర్తు చేశారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. మాయమాటలు నమ్మకుండా అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. స్థానిక ప్రజలకు చీరలను పంపిణీ చేశారు. రాగిరి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు యువకులు కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇదీ చదవండి:అర్హులైనవారందరికీ డబుల్బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి: భట్టి