ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

గోపన్​పల్లి భూ ఆరోపణలపై స్పందించిన ఎంపీ రేవంత్​రెడ్డి - పట్టణ గోస

తనపై వస్తున్న గోపన్​పల్లి భూ ఆరోపణలనపై ఎంపీ రేవంత్​ రెడ్డి స్పందించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న ప్రతిసారి అధికార పార్టీ వర్గాలు తనపై ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాయన్నారు. వీటికి భయపడి 'పట్టణ గోస'ను ఆపేదిలేదంటూ వ్యాఖ్యానించారు.

mp revanth reddy spoke on gopanpally land Allegations in hydearabad
గోపన్​పల్లి భూ ఆరోపణలపై స్పందించిన ఎంపీ రేవంత్​రెడ్డి
author img

By

Published : Feb 27, 2020, 1:36 PM IST

క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న తనపై అక్రమ కేసులు పెట్టడం సహజమని మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్​ రెడ్డి అన్నారు. గోపనపల్లి భూ ఆరోపణలపై రేవంత్​రెడ్డి స్పందించారు. అధికారులతో పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు.

2005లో తాను ఆస్తులను కొంటే 1978 సంవత్సరంలో రికార్డులు తారుమారు చేసినట్లు రావడం ఏంటని అన్నారు. ఆ సమయంలో తనకు గోపన్​పల్లి ఎక్కడ ఉందో కూడా తెలియదనన్నారు. భూ అక్రమాలపై నిజానిజాలను కోర్టే తేలుస్తుందని ఆయన వెల్లడించారు.

గోపన్​పల్లి భూ ఆరోపణలపై స్పందించిన ఎంపీ రేవంత్​రెడ్డి

ఇదీ చూడండి: నాంపల్లి కోర్టుకు హాజరైన కల్వకుంట్ల కవిత

ABOUT THE AUTHOR

...view details