తెలంగాణ

telangana

ETV Bharat / state

30 రోజుల్లో నిందితులకు ఉరిశిక్ష వేయాలి: రేవంత్​రెడ్డి - రేవంత్​రెడ్డి వార్తలు

దిశ ఘటనపై దిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థులు, ప్రజాసంఘాలు ధర్నా చేపట్టాయి. ఆందోళనలో  కుంతియా, ఎంపీ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

MP REVANTH REDDY SPEAK ABOUT DISHA ISSUE AT JANTAR MANTAR IN DELHI
30 రోజుల్లో నిందితులకు ఉరిశిక్షపడాలి: రేవంత్​రెడ్డి

By

Published : Dec 2, 2019, 1:57 PM IST

దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన దిశ కేసు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తుండగా తాజాగా దిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థి సంఘాలు, మహిళా, ప్రజాసంఘాలు... ధర్నా చేపట్టాయి. ఆందోళనలో కుంతియా, ఎంపీ రేవంత్​రెడ్డి పాల్గొన్నారు. నల్ల రిబ్బన్లు ధరించి ధర్నాలో పాల్గొన్నారు. దోషులను బహిరంగంగా శిక్షించాలంటూ డిమాండ్‌ చేశారు. జస్టిస్ ఫర్ దిశా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దిశ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్​, హరీశ్​రావు ఒక్కసారైనా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని రేవంత్​ విమర్శించారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్లే దిశకు అలా జరిగిందని ఆరోపించారు. పార్లమెంటులో ఈ విషయాన్ని చర్చిద్దామంటే... చర్చకు అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. 30 రోజుల్లో నిందితులకు ఉరిశిక్ష పడేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

30 రోజుల్లో నిందితులకు ఉరిశిక్షపడాలి: రేవంత్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details