వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎల్బీనగర్లోని జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. వరదల కారణంగా హైదరాబాద్ అతలాకుతలం అయితే ముఖ్యమంత్రి కనీసం పర్యటించలేదంటూ రేవంత్ మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: రేవంత్ రెడ్డి - ఎంపీ రేవంత్ రెడ్డి వార్తలు
వరద బాధితులకు న్యాయం చేయాలంటూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. వరద బాధితులకు న్యాయం చేయకుండా... కేవలం పార్టీతో సంబంధం ఉన్న వారికే పదివేలు ఇచ్చారని ఆరోపించారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: రేవంత్ రెడ్డి
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: రేవంత్ రెడ్డి
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే హైదరాబాద్కు ఉపద్రవం వచ్చిందని ఆరోపించారు. ముంపు బాధితులకు అందించే సహాయంలో కుట్ర జరిగిందని వ్యాఖ్యానించారు. 10వేలు ఇస్తామని చెప్పి 5వేలు బాధితుల నుంచి లంచం తీసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తే అవినీతికి ఆస్కారం ఉండేది కాదని తెలిపారు. ఈ దోపిడిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:20 రోజులుగా జలదిగ్బంధం... బిక్కుబిక్కుంటున్న కాలనీవాసులు