కరోనా మూడో దశలో పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని.. ప్రజలు అప్రమత్తం కావాల్సి ఉందని ఎంపీ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు గుర్తు చేశారు. అన్ని విధాలా సిద్ధంగా ఉండి.. భవిష్యత్ తరాలను రక్షించుకుందామని ఆకాంక్షించారు. ఇప్పటి నుంచే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన ట్వీట్ చేశారు.
భవిష్యత్ తరాలను రక్షించుకుందాం: రేవంత్ రెడ్డి - కొవిడ్ మూడో దశ వార్తలు
అన్ని విధాలా సిద్ధంగా ఉండి.. కొవిడ్ మూడో దశ నుంచి పిల్లలను రక్షించుకుందామని ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి.. అప్రమత్తంగా ఉండాలని ట్విట్టర్ వేదికగా సూచించారు.
revanth on covid, Mp Revanth reddy, corona third Wave
మూడో దశను దృష్టిలో ఉంచుకుని అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. పిల్లల వ్యాధులకు సంబంధించిన ఔషధ ఉత్పత్తులను గణనీయంగా పెంచుకోవాలని ప్రభుత్వానికి రేవంత్ సూచించారు. వైద్యులకు, నర్సులకు శిక్షణ ఇచ్చి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: దిగ్గజ బ్యాడ్మింటన్ అంపైర్ కరోనాతో మృతి