తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇద్దరు సీఎంలు మాట్లాడుకుని వెంటనే పరిష్కరించండి: రేవంత్​ - కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​ రెడ్డి వార్తలు

తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్సులను అడ్డుకోవడం సరైందికాదని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​ రెడ్డి అన్నారు. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించుకుని పరిష్కారం చూపించాలని డిమాండ్​ చేశారు.

mp revanth reddy on boarder ambulance issue
తెలంగాణ వార్తలు

By

Published : May 14, 2021, 6:54 PM IST

ఏపీ నుంచి హైదరాబాద్​కు చికిత్సకోసం వస్తున్న కొవిడ్​ బాధితుల అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకోవడం సరైంది కాదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి అన్నారు. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. మానవీయ కోణంలో ఆలోచించి వెంటనే దీనికో పరిష్కారం చూపించాలని డిమాండ్​ చేశారు.

ఏపీకి చెందిన కొవిడ్​ బాధితుల అంబులెన్సులు అనుమతించకపోవడం వల్ల పలువురి పరిస్థితి విషమిస్తుందని.. కొందరిని సమీప ఆస్పత్రుల్లో చేర్పిస్తున్నారని రేవంత్​ పేర్కొన్నారు. ఈ విషయంపై ఇరు రాష్ట్రాల సీఎంలు ఓ నిర్ణయానికొచ్చి కొవిడ్​ బాధితుల ప్రాణాలు నిలబెట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details