పోలీసు కానిస్టేబుల్ నియామక పరీక్షలకు చెందిన మెరిట్ జాబితాను, కటాఫ్ మార్కులను తక్షణమే ప్రకటించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి... సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. 90 వేల మంది నిరుద్యోగ యువతకు సంబంధించిన ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఫలితాల విడుదలపై స్పష్టత లేక ఐదు నెలలుగా అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. నగరంలో ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినా స్పందన రాలేదని పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్టు విడుదలకు డీజీపీ, బోర్డు ఛైర్మన్ లను ఆదేశించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు రేవంత్ రెడ్డి లేఖ... - CM KCR
పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షల మెరిట్ జాబితాను, కటాఫ్ మార్కలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ