తెలంగాణ

telangana

ETV Bharat / state

తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి: ఎంపీ రేవంత్ - hydrebad news

ప్రభుత్వ ఉదాసీనత వల్లే శనగ రైతులు నష్టపోతున్నారని ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. మార్కెట్ మొత్తం దళారుల గుప్పిట్లోకి పోయిందని వ్యాఖ్యానించారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు.

mp revanth reddy letter to cm kcr on purchasing centers
తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి: ఎంపీ రేవంత్

By

Published : Feb 28, 2021, 4:44 PM IST

రాష్ట్రంలో రైతులు పండంచిన శనగలకు మద్దతు ధర కల్పించాలని.. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉదాసీనత కారణంగానే శనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. మార్కెట్​ మొత్తం దళారుల గుప్పిట్లోకి పోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు.

ప్రైవేటు వ్యాపారులు, దళారులపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో.. మార్కెట్ పూర్తిగా దళారుల చేతులోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఈ క్రమంలో శనగ రైతులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి... కనీసం మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:హైదరాబాద్​ రైతు వెంకట్​రెడ్డిపై మోదీ ప్రశంసల జల్లు

ABOUT THE AUTHOR

...view details