తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్ కోసమే ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించారు: రేవంత్‌రెడ్డి - mp revanth reddy on eetala issue

రాష్ట్రంలో కరోనా కిట్ల కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగిందని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసులు తగ్గించి చెప్పడం వల్లే రాష్ట్రానికి టీకాలు రావడం లేదని విమర్శించారు. ప్రతిపక్షాల సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

ఎంపీ రేవంత్‌రెడ్డి
ఎంపీ రేవంత్‌రెడ్డి

By

Published : May 13, 2021, 11:56 PM IST

ఎంపీ రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో వైద్య పరికరాలు, కరోనా కిట్‌ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అవినీతిపై విజిలెన్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రేవంత్ దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా వైద్య పరికరాలపై జీఎస్టీ రద్దు చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో ఒక్క నిపుణుడు కూడా లేరని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ కోసమే ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించారని ఆరోపించారు. కరోనా కేసులు తగ్గించి చెప్పడం వల్లే కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాయం అందడం లేదన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ లేకుండా పోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన టీకాలను రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చిన తర్వాతే బయటకు పంపేలా కేంద్రంతో చర్చించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: కొవిడ్‌ సోకిన వారందరికీ బ్లాక్‌ ఫంగస్‌ రాదు: రమేశ్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details