పట్టణ ప్రగతి పేరుమీద తెరాస చేసిన పాపాలను మాఫీ చేసుకునే ప్రయత్నం చేస్తోందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల కోసం... పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజలను మోసం చేసేందుకు కుట్ర చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్నం గోస... పేరుమీద కార్యక్రమం చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలో పేదలకు లక్ష రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని చెప్పి... కేవలం 108 మాత్రమే పూర్తి చేయడం ఏంటని ప్రశ్నించారు.
కేసీఆర్ ఎర్రవల్లికి సర్పంచా... చింతమడకకు ఎంపీటీసీనా?: రేవంత్ - సీఎం కేసీఆర్పై ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు
'సీఎం గారూ... మీరు ఎర్రవల్లికి సర్పంచా..? లేకా చింతమడకకు ఎంపీటీసా' అంటూ ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. కేవలం ఆ రెండు గ్రామాల అభివృద్ధి కోసమే మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారా ప్రజలు.. అంటూ ప్రశ్నించారు.
'సీఎం గారూ.. మీరు ఎర్రవల్లికి సర్పంచా? చింతమడకకు ఎంపీటీసా?'
ఎర్రవల్లిలో రెండు పడక గదుల ఇళ్లు... చింత మడకలో కుటుంబానికో 10 లక్షలు ఇవ్వడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడం లేదని కాకపోతే... కేసీఆర్ ఎర్రవల్లికి సర్పంచా..? లేదా చింతమడకకు ఎంపీటీసీనా..? అని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నిర్మాణం చేపట్టిన రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణం, కేసీఆర్ హామీ ఇచ్చిన లక్ష రెండు పడక గదులు ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:భాజపాలో చేరిన వీరప్పన్ కుమార్తె
TAGGED:
MP REVANTH REDDY LATEST NEWS