లాక్డౌన్తో పనులు లేక వీధినపడ్డ రోజువారి కూలీలకు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి 12 రోజులుగా ఆపన్నహస్తం అందిస్తున్నారు. పరిశ్రమలు మూత పడటంతో కార్మికులు.. పనులు లేక పిల్లా పాపలతో, మూటాముల్లె సర్దుకుని చెట్ల కిందో.. మెట్రో కిందకో చేరి ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి వారికోసం.. గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలకలగూడ, రైత్‌ఫిల్ బస్ స్టేషన్, తదితర ప్రాంతాల్లో రేవంత్ ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేశారు.
తక్షణమే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించండి: రేవంత్ రెడ్డి - ఉచిత భోజన వసతి
లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆకలితో అలమటించే వారికి 12 రోజులుగా భోజనాన్ని పంపిణీ చేస్తూ ఔదార్యాన్ని చాటుతున్నారు. లాక్డౌన్ సమయంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
లాక్డౌన్లో ఆర్థిక ప్యాకేజీ
ఆయా కేంద్రాల్లో ప్రతి రోజు వెయ్యి మందికి పైగా భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలో ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. ఉపాధి కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని అయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:Cabinet Meet: ఆదివారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం