కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కొండపోచమ్మ, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుల పనులపై సీబీఐ విచారణ జరిపి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొండపోచమ్మ, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత లోపాలు రోజుకోకటి బయట పడుతున్నాయని ఆరోపించారు. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లే కాలువకే పెద్ద గండి పడిందన్నారు.
కొండపోచమ్మ, కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలి: ఎంపీ రేవంత్‌రెడ్డి
కొండపోచమ్మ, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత లోపాలు రోజుకోకటి బయట పడుతున్నాయని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించి.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లే కాలువకే పెద్ద గండి పడిందంటే... నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి నెల కూడా కాకుండానే రెండు ప్రధాన కాలువలకు గండ్లు పడ్డాయని... సీఎం కేసీఆర్ నియోజక వర్గంలోని కాలువ పనుల్లోనే నాణ్యత ఇంత ఘోరంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇతర కాలువలు, జలాశయాల నాణ్యత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
చిన్న కాలువల పరిస్థితి ఇలా ఉంటే మల్లన్న , కొండపోచమ్మ , గందమల్లల పరిస్థితి ఎలా ఉండబోతోందోనన్న భయం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ జలాశయాలకు ఇలాగే ఈ కాలువకు పడినట్లే గండి పడితే ఒక్క ఊరు కూడా మిగలదన్నారు. కేసీఆర్, మెఘా కంపెనీ కమిషన్ల కక్కుర్తికి ఇది పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్ అవినీతి, అక్రమాల కారణంగానే కాలువకు గండి పడిందని... గ్రామాలల్లో ప్రజలకు జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసి కాంట్రాక్టర్ ద్వారా ప్రజలకు పరిహారం ఇప్పించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:భారత్ బయోటెక్‌కు గవర్నర్ తమిళిసై అభినందనలు
TAGGED:
revant fire on cm kcr