సొంత పార్టీ నేతలైన అద్వానీ, జోషి, కల్యాణ్ సింగ్‌లను గౌరవించుకోలేని భాజపా.. పరాయి పార్టీ నేతలపై ప్రేమ ఒలకబోయడం ఏమిటని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజంగా పీవీ, ఎన్టీఆర్‌లపై భాజపాకు ప్రేమ ఉంటే వారిద్దరికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈనెల 29న హైదరాబాద్ వస్తున్న అమిత్ షా.. ఆ మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే ప్రకటన చేయాలన్నారు. ప్రతిరోజు రాత్రి బండి సంజయ్, అరవింద్–అసద్, అక్బర్‌ల మధ్య ఫోన్ సంభాషణ నడుస్తుందన్నారు. ఇందుకు అమిత్ షా సంధానకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.