సికింద్రాబాద్ హస్మత్‌పేటలో ఉన్న త్రించింగ్ పాయింట్ ప్రాంతాన్ని కంటోన్మెంట్ డీజీడీఈ అధికారి దీప బజువ సందర్శించారు. అనంతరం బోర్డు కార్యాలయానికి చేరుకుని సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. కంటోన్మెంట్ సీఈవో చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని పలు అభివృద్ధి అంశాలు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. ఈ భేటీకి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి, కంటోన్మెంట్ శాసన సభ్యుడు సాయన్న హాజరయ్యారు.
గత కొన్నేళ్లుగా దీర్ఘకాలికంగా ఉన్న రామన్న కుంట చెరువు సుందరీకరణ, బొల్లారంలోని వంద పడకల ఆసుపత్రి వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు సాగాయి. కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై చర్యలు తీసుకుంటామని బోర్డు సభ్యులకు ఆమె హామీ ఇచ్చారు.