ఆంధ్రప్రదేశ్ కుప్పకూలే పరిస్థితి ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. ఏపీ రాజధాని పరిణామాలపై తెలంగాణ వాడిగా సంతోషంగా ఉందని అన్నారు. భారతీయ పౌరుడిగా బాధగా ఉందని పేర్కొన్నారు. ఏపీ పరిణామాల వల్ల హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం పెరిగిందని వెల్లడించారు.
'స్థిరాస్తి వ్యాపారికి లాభం చేకూర్చేందుకే అమరావతిలో గందరగోళం' - ఏపీ రాజధానిపై ఎంపీ రేవంత్ రెడ్డి ఆసక్తిర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని తాజా పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్నటి వరకు సోదరులుగా ఉన్న రాష్ట్రంలో ముసలం పుట్టడం బాధగా ఉందని అన్నారు. ఒక వ్యాపారి తన అపార్ట్మెంట్లు అమ్మకునేవరకు ఏపీలో గందరగోళం ఉంటుందని పేర్కొన్నారు.
ఆ స్థిరాస్తి వ్యాపారికి లాభం చేకుర్చేందుకే అమరావతిలో గందరగోళం
రాష్ట్రానికి స్థిరాస్తి వ్యాపార రంగం ఆదాయం పెరిగిందని... ఏపీ కుప్పకూలే పరిస్థితి వల్ల తెలంగాణకే లాభమని అన్నారు. ఇక్కడి ఓ స్థిరాస్తి వ్యాపారికి మేలు చేసేందుకే ఏపీలో గందరగోళం సృష్టించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఇదీ చూడండి: ట్రా'ఫికర్': పంతంగిలో కిలోమీటరు మేర స్తంభించిన వాహనాలు
Last Updated : Jan 12, 2020, 7:41 PM IST