తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాణహాని ఉంది రక్షణ పెంచండి: ఎంపీ రేవంత్ రెడ్డి - హైకోర్టును ఆశ్రయించి ఎంపీ రేవంత్​ రెడ్డి

తనకు నిరంతరం నలుగురు కేంద్ర బలగాలు లేదా స్వతంత్ర సంస్థలకు చెందిన భద్రత సిబ్బందిని నియమించాలని కోరుతూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

MP Ravanth Reddy has approached the telangana High Court latest news
MP Ravanth Reddy has approached the telangana High Court latest news

By

Published : Feb 28, 2020, 10:51 PM IST

తనకు గతంలో ముగ్గురు భద్రత సిబ్బంది ఉండే వారని.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరికి తగ్గించిందని ఎంపీ రేవంత్​ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస నేతలతో పాటు.. కేసీఆర్ సన్నిహితుడైన పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావుకు సంబంధించిన పలు అంశాలపై పోరాడుతున్నందున ప్రాణహాని ఉందని తెలిపారు.

తనకు నిరంతరం నలుగురు ఉండేలా ఫోర్ ప్లస్ ఫోర్ భద్రత కల్పించాలని గతేడాది కేంద్ర ప్రభుత్వానికి తాను దరఖాస్తు చేసుకున్నానని న్యాయస్థానానికి రేవంత్ రెడ్డి తన పిటిషన్​లో తెలిపారు. దానిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు జూపల్లి రామేశ్వరరావును ప్రతివాదులుగా చేర్చారు.

ఇవీ చూడండి:మళ్లీ కోర్టుకెళ్లిన నిర్భయ దోషి.. క్యూరేటివ్ పిటిషన్ దాఖలు

ABOUT THE AUTHOR

...view details