తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధ్రా ఎమ్మెల్యే కారులో తమిళనాడులో చిక్కిన సొమ్ముపై ఈడీ దృష్టి

ఏపీలో సంచలనం సృష్టించిన తమిళనాడు డబ్బుల వ్యవహారంపై అనేక అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎలాంటి పత్రాలు లేకుండా అంత నగదు ఎలా తరలించారు? అసలు ప్రజాప్రతినిధులు వినియోగించే కార్‌ స్టికర్​తో నగదు ఎలా మళ్లించగలిగారు?.. నగల వ్యాపారి నగదు మొత్తం తనదే అని ప్రకటించినా... తీసుకువెళ్లే తీరుమీదే చర్చంతా. శ్రీకాకుళం ఎంపీ రామోహనరావు ఈడీకి ఫిర్యాదు చేయడం వల్ల మరోమారు ఈ అంశం చర్చనీయాంశమైంది.

mp-rammohannaidu-complaint-to-ed-over-unaccounted-money-seized-at-chennai
ఆంధ్రా ఎమ్మెల్యే కారులో తమిళనాడులో చిక్కిన సొమ్ముపై ఈడీ దృష్టి

By

Published : Jul 27, 2020, 8:30 PM IST

ఆంధ్రప్రదేశ్​ ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతవాసి అయిన నగల వ్యాపారికి చెందిన నగదు తమిళనాడులో పట్టుబడ్డ కథ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టర్​కు చేరింది. నగదు రవాణా చేయాలన్నా, ఆ నగదు ఒక దగ్గర పెట్టుకోవాలన్న సవాలక్ష నిబంధనలు ఉన్నాయి. కోట్ల రూపాయల టర్నోవర్‌తో వ్యాపారం చేసే యజమానులు, సంస్థలు తమ దుకాణంలోగాని, ఇంట్లోగాని కొంత నగదు ఉంచుకోవచ్చు. అయితే అదంతా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రికార్డుల పరిమితిలో ఉండాలి.

నగదు రవాణా చేయాలంటే రెండు లక్షల రూపాయల మేరకు తీసుకువెళ్లవచ్చు... అంతకు మించి రవాణా చేయాలంటే నగదుతోపాటు తగిన పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. పెద్ద స్థాయిలో ఆర్థిక లావాదేవీలు చేసేవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని అన్ని రకాల పత్రాలు పక్కన పెట్టుకొని వ్యవహారం నడుపుకొంటారు. అలాంటిది ఎలాంటి పత్రాలు లేకుండా బంగారు వర్తకుడు నల్లమిల్లి బాలు పెద్ద మొత్తంలో నగదు రవాణా చేయడం పెద్ద విషయంగానే చెప్పవచ్చు.

ఇతర కారణాలు ఉన్నాయా?

తమిళనాడులో మంత్రి బాలినేని స్టిక్కర్​తో ఉన్న కారులో బంగారు వర్తకుడు నల్లమిల్లి బాలు పెద్దమెుత్తంలో నగదు రవాణా చేశాడు. ఇది తమ వ్యాపారంలో భాగమని బాలు చెప్పుకొచ్చారు.. అంతవరకూ బాగనే ఉన్నా.. ఆదాయపన్నుల శాఖ కళ్లు కప్పడానికే అలా చేశారా? ఇతర కారణాలు ఉన్నాయా? అన్నది ఇప్పుడు తేల్చాల్సి ఉంది. నల్లమిల్లి బాలు.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడు. బాలినేని కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఈ వ్యవహారం మంత్రి బాలినేని చుట్టూ తిరుగుతోంది.

రూ.5.27 కోట్ల నగదు లభించిన వాహనానికి ఎమ్మెల్యే బాలినేని స్టిక్కర్‌ ఉండటం వల్ల తొలుత ఈ స్టికర్‌ బాలినేనిదనే భావించారు. అందువల్ల బాలినేని కారులోనే ఈ నగదు తరలిస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ నగదుకు తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు బాలినేని. నగదు తరలించిన నల్లమిల్లి బాలు కూడా ఈ స్టికర్​కు, నగదుకు గానీ బాలినేనికి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. తనకు తెలీయకుండా తన డ్రైవర్‌ స్టిక్కర్ అంటించారని చెప్పుకొచ్చారు.

తనిఖీలు ఎందుకు చేయలేదు?

తమిళనాడు ఆదాయపన్నుల శాఖాధికారులు కూడా నగదు తనదేనని ధ్రువీకరించారని బాలు వెల్లడించారు. ఒంగోలులో తనిఖీలు కూడా నిర్వహించారని పేర్కొన్నారు. ఈ కథంతా సరిగానే ఉన్నా... తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టర్‌కు ఫిర్యాదు వెళ్లడం, వాళ్లు దీనిపై ఆరా తీయడం ప్రారంభించారు. అసలు ఆంధ్రా నుంచి పలు చెక్‌ పోస్టులను తప్పించుకొని ఎలా నగదు వెళ్లింది? ఎక్కడా తనిఖీలు ఎందుకు చేయలేదు? అసలు ఆ నగదు ఎవరిది? ఎమ్మెల్యే స్టికర్‌ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎందుకు గుమ్మనంగా ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అలా చేయడం నేరం

శాసన సభ , శాసన మండలి కార్యదర్శి విడుదల చేసిన అధికారిక పాస్‌ నకిలీది తయారు చేయడం లేదా దుర్వినియోగం చేయడం పెద్ద నేరం. గతంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పాస్‌ (స్టికర్)కు బదులు నకిలీ వినియోగించారు. ఆ కారు ప్రమాదానికి గురవ్వడం వల్ల ఆయన దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. నగదు రవాణా సమయంలో స్టికర్‌ వినియోగంపై కూడా ఈడీ దృష్టి సారించాలని ఫిర్యాదు వెళ్లింది.

ఇవీ చూడండి:రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details