ఏపీలోని అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం విడుదల చేయాలని ఆ రాష్ట్ర సీఎం జగన్‌ను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు సీఎంకు వరుసగా ఐదో లేఖ రాశారు. ఎన్నికల్లో వైకాపా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ గత నాలుగు రోజులుగా జగన్‌కు రఘురామ లేఖలు రాస్తున్నారు.
జగన్‌కు రఘురామ ఐదో లేఖ: ఈ సారి ఏ హామీని గుర్తు చేశారంటే...! - ఎంపీ రఘురామకృష్ట రాజు లేఖ తాజా
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు.. వాటి అమలు తీరుపై.. ఆ రాష్ట్ర సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ట రాజు ఐదో లేఖ రాశారు. ఈ సారి అగ్రిగోల్డ్ అంశాన్ని ప్రస్తావించారు. ఇచ్చిన హామీ ప్రకారం.. వెంటనే బాధితులకు పరిహారం చెల్లించాలన్నారు. రూ.1,100 కోట్లు ఇచ్చి మద్దతుగా నిలుస్తానన్న హామీ అమలు చేయాలని అన్నారు.
తొలి నాలుగు రోజుల్లో వృద్ధాప్య పింఛన్ల పెంపు, సీపీఎస్ రద్దు, పెళ్లికానుక.. షాదీముబారక్, ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అంశాలను ప్రస్తావించిన ఆయన.. తాజాగా అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై లేఖ రాశారు. బాధితుల్లో ఎక్కువగా రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులే ఉన్నారని వారిని ఆదుకోవాలన్నారు.
వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే 80 శాతం మంది బాధితులకు మేలు చేసేలా రూ.1100 కోట్లు విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని రఘురామ గుర్తు చేశారు. వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.