ప్రధాని ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం సభకు తనను రానీయకుండా అడ్డుకున్నారని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలానే ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకుంటారని తెలిసే ప్రొటోకాల్ వంటి అంశాలపై ముందే లేఖ రాశానని అయినా.. తన పేరును లిస్టులో అధికారులు ఎందుకు చేర్చలేదో అర్థంకావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు ఆదేశాలిచ్చినా పట్టించుకోకపోతే ఏమనాలని ప్రశ్నించారు.
"ప్రధాని సభకు రాకుండా నన్ను అడ్డుకున్నారు. విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలానే ఉంటాయి. పర్యటన లిస్టులో నా పేరు లేదని తెలిసి ఆశ్చర్యపోయా. ఇవన్నీ తెలిసే ప్రొటోకాల్ వంటి అంశాలపై ముందే లేఖ రాశా. నా పేరును లిస్టులో అధికారులు ఎందుకు చేర్చలేదో అర్థంకావట్లేదు. కోర్టులు ఆదేశాలిచ్చినా పట్టించుకోకపోతే ఏమనాలి ?." - రఘురామ కృష్ణరాజు, వైకాపా ఎంపీ