Raghurama On Employees Protest:ఉద్యోగులు చర్చలకు రావాలని అడగడానికి సజ్జల ఎవరని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఉద్యోగులు భావిస్తున్నారని ఆయన అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారని పేర్కొన్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వద్దని ఉద్యోగులు డిమాండ్ చేసినా.. ఒకటో తేదీకే జీతాలు వేసేశారని మండిపడ్డారు. చలో విజయవాడకు వచ్చిన జనప్రవాహాన్ని చూసి పోలీసులు చేతులెత్తేశారన్నారు. పోలీసులు ఉద్యోగులే కదా.. వాళ్లకూ సమస్యలు ఉండవా ? అని ప్రశ్నించారు. ఏపీ రణాంధ్రగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రఘురామ అన్నారు.
"ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఉద్యోగులు భావిస్తున్నారు. చర్చలకు రావాలని అడగడానికి సజ్జల ఎవరు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వద్దని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగులు వద్దన్నారని ఒకటో తేదీకే జీతాలు వేసేశారు. జనప్రవాహాన్ని చూసి పోలీసులు చేతులెత్తేశారు. పోలీసులు ఉద్యోగులే కదా.. వాళ్లకూ సమస్యలు ఉండవా ?. ఉద్యోగులతో చర్చించడానికి సజ్జల ఎవరు" -రఘురామ కృష్ణరాజు, నరసాపురం ఎంపీ
సజ్జల ఘాటు వ్యాఖ్యలు..
Sajjala On Employees Protest :ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులను రోజూ చర్చలకు ఆహ్వానించాల్సిన అవసరం లేదన్నారు. వారి తదుపరి కార్యాచరణ ఏంటో తెలియదన్న సజ్జల.. చర్చలకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందన్నారు. చర్చలు జరిపితేనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని.. అలాంటప్పుడు వారు ఎవరిపై ఒత్తిడి తెస్తారని వ్యాఖ్యానించారు.
ఉద్యోగుల ఉద్యమంలో పార్టీలు చేరితే పరిస్థితి చేయి దాటుతుంది.ఉద్యోగులకు ఇచ్చిన అవకాశాలను వదులుకుంటున్నారు. కొవిడ్ వేళ భారీ సామూహిక కార్యక్రమాలు సరికాదు. ఉద్యోగుల ఉద్యమంలో పార్టీలు కూడా చేరాయి. ఉద్యోగుల ఉద్యమానికి పార్టీలను స్వాగతిస్తామంటున్నారు. పార్టీలు చేరితే ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఉద్యోగులే బదిలీలు కోరుతున్నారు.. అలాంటప్పుడు ప్రభుత్వం బదిలీల ప్రక్రియ ఎందుకు ఆపుతుంది. సమ్మె నోటీసు ఇచ్చారని ప్రభుత్వం బదిలీలు ఆపుతుందా? సమ్మె నోటీసు ఇచ్చామని.. ఉద్యోగులపై చర్యలు తీసుకోవద్దంటే ఎలా ? అత్యవసర సేవలు ఆపితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
ఇదీ చూడండి:Revanth Reddy on KCR: 'మోదీ, కేసీఆర్కు.. జిన్పింగ్, కిమ్ లాంటోళ్లే ఆదర్శం..'