ఆర్మీ ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్ - ఆర్మీ ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్
11:39 May 26
ఆర్మీ ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్
ఆంధ్రప్రదేశ్ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు.. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ రఘురామపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి గుంటూరు తరలించింది. రఘురామరాజుకు బెయిల్ మంజూరు చేస్తూ ఈనెల 21న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 24న ఆయన తరఫున న్యాయవాదులు... గుంటూరు సీఐడీ కోర్టులో పూచీకత్తు సమర్పించారు.
ఈ సందర్భంగా రఘురామరాజు ఆరోగ్య పరిస్థితిపై మెజిస్ట్రేట్ ఆరా తీశారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి పూర్తి వివరాలతో డిశ్చార్జ్ సమ్మరీని ఇవ్వాలని సూచించారు. ఆర్మీ ఆసుపత్రి వర్గాలు.. డిశ్చార్జ్ సమ్మరి ఇవ్వడంతో.. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న రఘరామ ప్రత్యేక విమానంలో నేరుగా దిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఇదీ చూడండి:ఎంపీ రఘురామ కేసులో.. కేంద్రం, సీబీఐకు సుప్రీం నోటీసులు