రాష్ట్రాల బడ్జెట్‌లలో ఉచిత పథకాలు, కానుకలకు.. పరిమితి విధించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఉచిత పథకాల ద్వారా రాష్ట్ర ఖజానాలు ఖాళీ అవుతున్నాయని.. కోలుకోలేని అప్పుల్లో కూరుకుపోతున్నాయని వివరించారు. అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి.. కీలక అంశాలు విస్మరించి వాటి నిధులను కూడా ఓట్ల కోసం ఉచితాలకు తరలిస్తున్నారని ఆక్షేపించారు.
ఉచిత పథకాలకు బడ్జెట్‌లో పరిమితి విధించాలని ప్రధానికి ఎంపీ లేఖ - ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానికి లేఖ
ప్రధాని మోదీకి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. రాష్ట్రాల్లో ఉచిత పథకాల ద్వారా ఖజానాలు ఖాళీ అవుతున్నాయంటూ లేఖలో పేర్కొన్నారు. కోలుకోలేని అప్పుల్లో రాష్ట్రాలు కూరుకుపోతున్నాయని అన్నారు. ప్రభుత్వాలు లబ్ధిదారులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని పేర్కొన్నారు. ఓట్ల కోసం నిధులను కూడా ఉచితాలకు తరలిస్తున్నారని లేఖలో ఎంపీ ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర ఖజానాలు ఉచితాలకు పంచి పెట్టి మరిన్ని నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని.. ప్రధానికి రాసిన లేఖలో వివరించారు. ఉచిత పథకాల ద్వారా ప్రజలను.. నిరంతర యాచకులుగా రాష్ట్ర ప్రభుత్వాలు మారుస్తున్నాయని.. తద్వారా బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యపడదని స్పష్టం చేశారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య కేంద్రం వివక్ష చూపుతోందనే ఆరోపణలకు.. ఇదే మూల కారణమన్న రఘురామకృష్ణ రాజు.. ఉచితాల బడ్జెట్‌లో కేటాయింపులపై పరిమితి విధించడం ద్వారా.. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టవచ్చని సూచించారు.
TAGGED:
MP Raghuramkrishna Raju news