తెలంగాణ

telangana

ETV Bharat / state

RRR On Resign: 'త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తా' - RRR Latest Pressmeet

RRR Latest Pressmeet: తనపై అనర్హత వేటు వేయకపోతే తానే రాజీనామా చేస్తానని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. తాను రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తానని.. వైకాపాపై ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తానన్నారు.

RRR On Resign Politics
వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు

By

Published : Jan 7, 2022, 2:24 PM IST

RRR Latest Pressmeet: త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రకటించారు. తనపై అనర్హత వేటు వేయించాలని చూస్తున్నారని అన్నారు. తానే సమయం ఇస్తున్నానని.. వారంలో నిర్ణయం చెప్పాలని పరోక్షంగా వైకాపా అధినాయకత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

'అనర్హత వేటు వేయించేందుకు సమయం ఇస్తున్నా. అనర్హత వేటు వేయకపోతే నేనే రాజీనామా చేస్తా. నేను రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తా. వైకాపాపై ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తా. పార్టీ నుంచి తొలగించాలని యత్నించినా సాధ్యం కాలేదు.'

- వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు

రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలించేందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్ల ఎంపీ రఘురామ స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి కొనసాగింపునకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:Revanth Reddy Tweet: 'కీచక రాఘవ ఎక్కడ.?.. ప్రగతిభవన్‌లోనా.. ఫామ్‌హౌస్‌లోనా..'

ABOUT THE AUTHOR

...view details