MP Nama Nageswara Rao Speech In Lok Sabha : కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని.. కేంద్రం నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే తమ పార్టీ ఎంపీలంతా రాజీనామా చేయడానికి సిద్ధమని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు(Nama Nageswara Rao) సవాల్ విసిరారు. ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎంపీ మాట్లాడారు. బీజేపీ ఎంపీలంతా అబద్ధాలు చెపుతున్నారని మండిపడ్డారు. ఆ కూటమి ఎంపీలు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఎంపీ నిషికాంత్ దూబేపై బీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు.
మణిపుర్ హింసాత్మక ఘటన(Manipur Clash)పై విపక్షాలు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ మేరకు లోక్‌సభ(Lok Sabha)లో అధికార పక్షాలు, విపక్షాల మధ్య తీవ్ర దుమారమే రేగుతోంది. బీఆర్ఎస్(BRS) తరఫున ఆ పార్టీ లోక్‌సభాపక్షనేత నామ నాగేశ్వరరావు ఘాటుగానే అధికార పక్షానికి చురకలు అంటిస్తున్నారు. తెలంగాణలోని సమస్యలను లేవనెత్తుతూ.. అవిశ్వాసంపై మాట్లాడారు. మణిపుర్ హింసాత్మక ఘటన దేశానికే సిగ్గుచేటని ఎంపీ పేర్కొన్నారు. విదేశాల్లోనూ భారత్ పరువు మంటల్లో కలిసిందని దుయ్యబట్టారు.
Telangana Debts in 2022-23 : పెరుగుతున్న రుణభారం.. 2022-23లో రూ.20 వేల కోట్ల మార్కు దాటిన అప్పు
Nama Nageswara Rao Roaring Speech on Manipur Issue : ప్రధాని నరేంద్ర మోదీ మణిపుర్‌కు అభిలపక్షాన్ని తీసుకెళ్లి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని నామ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అక్కడ శాంతిని పునరుద్ధరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని.. అందరికీ సమాన న్యాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.