కొవిడ్ వ్యాక్సినేషన్ తయారీలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉన్నా.. టీకాల ప్రక్రియ మాత్రం నత్తనడకన కొనసాగుతోందని తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 10 శాతం మంది మాత్రమే మొదటి డోసు తీసుకున్నారని.. దానికి గల కారణాలను తెలపాలని లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ స్పందించారు. నామ వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. ఈ నెల 20 వరకు దేశంలో 18 సంవత్సరాల వయసు పైబడిన వారిలో 34.5 శాతం మంది మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలిపారు.
నామ ప్రశ్నల పరంపర
ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొదటి, రెండు డోసులు వేయించుకున్నవారి సంఖ్య, కరోనా టీకా కేంద్రాలపై కేంద్ర మంత్రిని నామ వివరణ అడిగారు. టీకాల కొరతతో చాలా వరకు వ్యాక్సినేషన్ కేంద్రాలు మూసి ఉంటున్నాయని.. అవి తిరిగి అందుబాటులోకి ఎప్పుడు వస్తాయని ప్రశ్నించారు. ప్రజల్లో టీకాపై అవగాహన, వ్యాక్సిన్ల సరఫరా పెంచేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని కేంద్రాన్ని అడిగారు. అత్యవసర పరిస్థితుల్లో విదేశాల్లో తయారయ్యే వ్యాక్సిన్ల వినియోగంపై వివరణ కోరారు.
వ్యాక్సిన్ కొరత లేదు