తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదివారం పదిగంటల పది నిమిషాలకు ఎంపీ నామ ఏం చేశారంటే... - నామ నాగేశ్వర్​ రావు తాజా సమాచారం

మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు... ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా... ఎంపీ నామ నాగేశ్వర్​ రావు తన నివాసంలోని పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

NAMA
NAMA

By

Published : May 31, 2020, 7:21 PM IST

హైదరాబాద్​లోని తన నివాసంలో తెరాస లోక్​సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పూల కుండీలు, పరిసరాలు శుభ్రం చేసి, ఆదర్శంగా నిలిచారు. ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించాలని సూచించారు.

సామాజిక బాధ్యతతో ప్రజల్ని చైతన్యపరిచి సీజనల్ వ్యాధులను తరిమి కొట్టాలని అన్నారు. సమాజాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు.

ఆదివారం పదిగంటల పది నిమిషాలకు ఎంపీ నామ ఏం చేశారంటే...

ఇదీ చూడండి:మంత్రి జగదీశ్​రెడ్డి వర్సెస్ ఉత్తమ్​కుమార్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details