'రాష్ట్రాన్ని చాలా విషయాల్లో కేంద్రం అన్యాయం చేస్తోంది..' Nama Comments: తెలంగాణకు అనేక అంశాల్లో కేంద్రం చాలా అన్యాయం చేస్తోందని లోక్‌సభాపక్షనేత నామ నాగేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన ఒక్క పని కూడా సక్రమంగా చేయటం లేదని మండిపడ్డారు. నవోదయ విద్యాలయాలపై విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాయిదా తీర్మానం ఇచ్చినట్టు నామ తెలిపారు. జిల్లాకో నవోదయ విద్యాలయం ఇవ్వాలని ప్రధానికి ఎన్ని సార్లు లేఖలు రాసినా.. లాభం లేకుండా పోతోంది. తక్కువ జనాభా ఉన్న, చిన్న రాష్ట్రాలకు ఎక్కువ నవోదయాలు ఇచ్చి.. తెలంగాణకు మాత్రం కేవలం 9 విద్యాలయాలే ఇచ్చారు. అందుకే ఉభయసభల్లో నవోదయాలపై వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు.
అన్నింట్లో కేంద్రం వివక్ష..
"నవోదయాలపై ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇచ్చాం. నవోదయాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాయిదా తీర్మానం ఇచ్చాం. కేంద్రం చేయాల్సిన ఒక్క కార్యక్రమం కూడా సక్రమంగా చేయడం లేదు. జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలు ఇవ్వాలి. నవోదయా విద్యాలయాలపై ప్రధానికి ఎన్నోసార్లు లేఖలు రాశాం. నవోదయ విద్యాలయ సమితి ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్‌లోనూ ఉంది. నవోదయాలను 33 జిల్లాలకు ఇవ్వాలి.. కానీ పెడచెవిన పెడుతున్నారు. తక్కువ జనాభా ఉన్న, చిన్న రాష్ట్రాలకు ఎక్కువ నవోదయ విద్యాలయాలు ఇచ్చారు . కానీ, తెలంగాణకు మాత్రం ఇప్పటివరకు కేవలం 9 విద్యాలయాలు ఇచ్చారు. బాగా చదువుతున్న వారిలో తెలంగాణ విద్యార్థులు ముందు వరసలో ఉన్నారు. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలకు నవోదయాలు ఇస్తున్నారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐడీలు, ట్రిపుల్‌టీల్లో ఏ ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. 150 వైద్య కళాశాలల్లో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. కేంద్రం అన్ని విషయాల్లో తెలంగాణపై వివక్ష చూపిస్తోంది."- నామ నాగేశ్వరరావు, లోక్‌సభాపక్ష నేత
ఇదీ చూడండి: