వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ.3 వేల కోట్ల పెండింగ్ నిధులను సత్వరమే విడుదల చేయాలని తెరాస లోక్‌సభా పక్షనేత, ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభలో సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
ఈ పెండింగ్ నిధుల విడుదల, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, తాను ఎన్నోసార్లు రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఎంపీ పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆ నిధులను విడుదల చేయాలన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేసి, మద్దతుగా నిలవాలని కోరారు.