తెలంగాణ

telangana

ETV Bharat / state

MP Kotha Prabhakar Reddy Health Bulletin : కొత్త ప్రభాకర్​రెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ.. 10 రోజులు ఆసుపత్రిలోనే ఉండాలన్న వైద్యులు

MP Kotha Prabhakar Reddy Health Bulletin : దుబ్బాక బీఆర్​ఎస్ ఎమ్మెల్యే​ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. సికింద్రాబాద్​ యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన.. వైద్యులతో మాట్లాడి ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం కుటుంబసభ్యులతో మాట్లాడి.. వారికి ధైర్యం చెప్పారు. మరోవైపు.. ప్రభాకర్​రెడ్డి హెల్త్​ బులిటెన్​ను వైద్యులు వెల్లడించారు. మరో 10 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని చెప్పారు.

MP Kotha Prabhakar Reddy Health Bulletin
MP Kotha Prabhakar Reddy Health Bulletin

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2023, 10:19 PM IST

MP Kotha Prabhakar Reddy Health Bulletin : సిద్దిపేట జిల్లాలో కత్తి దాడికి గురై.. సికింద్రాబాద్​ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్​ ఎంపీ, దుబ్బాక బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్​రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన.. వైద్యులతో మాట్లాడి ఎంపీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స గురించి వైద్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డికి 6 సెంటిమీటర్ల మేర కత్తి గాటు పడిందని వైద్యులు తెలిపారు. శరీరం లోపల బ్లీడింగ్ అవుతునట్లు గుర్తించామని.. చిన్న పేగుకు 4 చోట్ల గాయం అయిందని వివరించారు. చిన్న పేగును 15 సెం.మీ. మేర తొలగించి కుట్లు వేశామన్నారు. త్వరగా ఆసుపత్రికి చేరుకోవడంతో ఇన్‌ఫెక్షన్ ముప్పు తప్పిందన్న వైద్యులు.. 10 రోజుల వరకు ఆసుపత్రిలో ఉండాలని చెప్పారు. అనంతరం కేసీఆర్.. ఎంపీ కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

MP Kotha Prabhakar Reddy Health Bulletin కొత్త ప్రభాకర్​రెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ 10 రోజులు ఆసుపత్రిలోనే ఉండాలన్న వైద్యులు

Murder Attempt on MP Kotha Prabhakar Reddy : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం.. యశోద ఆస్పత్రిలో శస్త్రచికిత్స, ఐసీయూకు తరలింపు

ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి 6 సెం.మీ. మేర కత్తిగాటు పడింది. శరీరం లోపల బ్లీడింగ్ అవుతునట్లు గుర్తించాం. చిన్న పేగుకు 4 చోట్ల గాయం అయింది. చిన్న పేగు 15 సెం.మీ. మేర తొలగించి కుట్లు వేశాం. 10 రోజుల వరకు ఆసుపత్రిలో ఉండాలి. - యశోద ఆసుపత్రి వైద్యులు

CM KCR on Kotha Prabhakar Reddy Murder Attempt : 'ప్రభాకర్​రెడ్డిపై జరిగిన దాడి నాపై జరిగినట్లే.. మాకు తిక్కరేగితే రాష్ట్రంలో దుమ్మురేగిపోద్ది'

ఇదిలా ఉండగా.. ప్రభాకర్​పై కత్తి దాడి అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. దాడిని ఖండిస్తున్నామన్న మంత్రి కేటీఆర్.. నిరాశలో ఉన్న కాంగ్రెస్‌ భౌతికదాడులకు దిగుతోందని విమర్శించారు. బీఆర్​ఎస్​ నేతలను భౌతికంగా అంతం చేసేందుకు యత్నిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో హింస, దాడులకు తావు లేదన్న కేటీఆర్.. ఘటనపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. చికిత్స కోసం ప్రభాకర్‌రెడ్డిని తీసుకొచ్చిన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి వెళ్లిన బీఆర్​ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు.. మంత్రి హరీశ్‌రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి.. ఆస్పత్రికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రులు ఆరోపించారు.

Governor Reacted on MP Kotha Prabhakar Reddy Murder Attempt : 'ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి'

కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులతో ఎవరూ గెలవలేరన్న ఆయన.. కాంగ్రెస్ హింసను ఎప్పుడూ నమ్ముకోదన్నారు. కాంగ్రెస్‌ గెలుస్తుందనే భయంతో కావాలనే తమపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అహింస మూల సిద్ధాంతంగానే పని చేస్తుందని స్పష్టం చేశారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన వ్యక్తి ఎవరైనా.. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. దాడి ఘటనపై తక్షణమే పోలీసులు విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు చెప్పాలని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

MLA Raghunandan Rao on MP Prabhakar Reddy Attack : 'నాపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోంది.. ఆ దాడికి నాకు సంబంధం లేదు'

ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిని బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్‌రావు ఖండించారు. దాడికి పాల్పడింది బీజేపీ వాళ్లు కాదని.. మహబూబ్‌నగర్‌లో స్పష్టం చేశారు. ఘటన జరగ్గానే కారణం రఘునందన్‌రావు అని.. బీజేపీ హింసను ప్రేరేపిస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

CM KCR Speech at Jukkal Praja Asheerwada Sabha : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. కరెంట్‌ ఉండదు, రైతుబంధు అందదు : కేసీఆర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details