సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. కరోనా బారిన పడిన సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పంటలు త్వరగా కొనుగోలు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. 6 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి... ఐకేపీ కేంద్రాలను ఇంకా తెరవలేదని ఆరోపించారు.
సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ - Komati reddy venkat reddy news
కరోనా మహమ్మారి బారిన పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. అందులో పంటల కొనుగోలు గురించి ప్రస్తావించారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ
ప్రభుత్వం ఇంకా ధాన్యం ఎందుకు కొనడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రైతులతో కలిసి యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు. దిల్లీ తరహా ఉద్యమం రాష్ట్రంలో కూడా రావాలని అన్నారు.
ఇదీ చదవండి: కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాజకీయ ప్రముఖుల ఆకాంక్ష