తహసీల్దార్ మృతి గురించి తెలుసుకున్న ప్రజా ప్రతినిధులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అధికారులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని...భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసి దోషులకు తగినశిక్ష పడేలా చూడాలన్నారు. ఇంతపెద్ద ఘటన జరిగినా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి, సీఎం స్పందించలేదని విమర్శించారు. సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటనగా అభిప్రాయపడ్డారు.
తహసీల్దార్ హత్యకు గురైనా.. సీఎం స్పందించరా? ఎంపీ కోమటిరెడ్డి - mp komatireddy venkatareddy Fires on CM KCR Because of MRO murder in Abdullapurmet Rangareddy district
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖడించారు. అధికారులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వెల్లడించారు.

తహసీల్దార్‌ను హత్య చేసిన సీఎంకు పట్టదా...?
తహసీల్దార్‌ను హత్య చేసిన సీఎంకు పట్టదా...?
TAGGED:
mp komatireddy venkatareddy