తెలంగాణ

telangana

ETV Bharat / state

రేవంత్​ రెడ్డి​ సమావేశానికి గైర్హాజరుపై ఠాగూర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వివరణ - telangana news

Komatireddy Meet Manikkam Tagore: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ సమావేశానికి హాజరుకాకపోవటంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి... కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌కు వివరణ ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఠాగూర్‌తో భేటీ అయ్యారు. కోమటిరెడ్డి స్టార్ క్యాంపెయినర్ అని.. ఇంఛార్జిని కలవడం సహజమేనన్న ఠాగూర్‌.. పార్టీలో ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు.

సాగర్​ సమావేశానికి గైర్హాజరుపై ఠాగూర్‌కు కోమటిరెడ్డి వివరణ
సాగర్​ సమావేశానికి గైర్హాజరుపై ఠాగూర్‌కు కోమటిరెడ్డి వివరణ

By

Published : Apr 30, 2022, 2:18 PM IST

Komatireddy Meet Manikkam Tagore: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్​ను ‌స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. ఈ ఉదయం హైదరాబాద్​లోని ఎమ్మెల్యే నివాస ప్రాంగణంలోని మానిక్కం ఠాగూర్ ఉంటున్న క్వార్టర్​కి వెళ్లి కోమటిరెడ్డి పలు అంశాలపై చర్చించారు. కోమటిరెడ్డి స్టార్ క్యాపెయినర్​గా తాను రాష్ట్ర పార్టీ ఇంఛార్జిగా కలవడం సహజమేనని మానిక్కం స్పష్టం చేశారు.

పార్టీ రాష్ట్ర శాఖలో ఎలాంటి విభేదాలు లేవని, కోమటిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించలేనని తెలిపారు. ఉమ్మడి నల్గొండ సన్నాహక సమావేశంలో తాను ఎందుకు పాల్గొనలేకపోయానని ఠాగూర్​కి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం బోయినపల్లిలో ఉన్న పార్టీ స్థలాన్ని ఏఐసీసీ కార్యదర్శి బోస్‌ రాజుతో కలిసి మానిక్కం ఠాగూర్​ పరిశీలించారు. అక్కడే పార్టీ నేతలతో రాహుల్‌ గాంధీ సమావేశం ఏర్పాటు చేయాలని పీసీసీ భావిస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details