2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గుర్రంపోడు మండల కేంద్రంలో జానారెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయన్నారు. డబ్బు సంచులతో.. సీఎం కేసీఆర్ ఓటర్లను మభ్యపెట్టి గెలుపొందాలని చూస్తున్నాడని ఆరోపించారు.
'జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు' - nagarjuna sagar by elections campaign
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గుర్రంపోడు మండల కేంద్రంలో జానారెడ్డి తరఫున ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయన్నారు. తాము అధికారంలోకి వస్తే జానారెడ్డినే సీఎం అభ్యర్థిగా ప్రకటించేలా పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పిస్తామన్నారు.
కమిషన్ల కోసం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి కల్వకుంట్ల కుటుంబం దోచుకుతింటున్నారని విమర్శించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని... వాళ్లను బతికించుకోవడానికి త్యాగాలకు సైతం వెనకాడబోమని స్పష్టంచేశారు. తాము అధికారంలోకి వస్తే జానారెడ్డినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేలా పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పిస్తామన్నారు. డబ్బుల సంచులతో కాంగ్రెస్ పార్టీ సర్పంచులను కొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.