తెలంగాణ

telangana

ETV Bharat / state

వీరజవాన్‌ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి : ఎంపీ కోమటిరెడ్డి - హైదరాబాద్ సమాచారం

ఉగ్రవాదులను అడ్డుకునే ప్రయత్నంలో వీరమరణం పొందిన మహేశ్ కుటుంబానికి రూ.కోటి ఆర్థికసాయం ప్రకటించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. వీరజవాన్‌ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన కోరారు.

MP Komatireddy demands help the govt soldier mahesh family
వీరజవాన్‌ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి : ఎంపీ కోమటిరెడ్డి

By

Published : Nov 9, 2020, 10:44 PM IST

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన మహేశ్‌ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోమన్‌పల్లికి చెందిన వీరజవాన్‌ కుటుంబానికి రూ.కోటి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన కోరారు.

దేశం రక్షణలో మహేశ్‌ చూపిన ధైర్యాన్ని ఎంపీ కొనియాడారు. రాబోయే తరానికి గుర్తుండేలా స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు అతని పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరసైనికుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలన్నారు.

ఇదీ చూడండి:'చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలన్న తపనే'

ABOUT THE AUTHOR

...view details