తెలంగాణ

telangana

ETV Bharat / state

Komati:'భవిష్యత్ తరాలకు ఆస్తులు లేని తెలంగాణ కోసం పథక రచన' - కేసీఆర్​పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు

భవిష్యత్ తరాలకు అప్పులను, ఆస్తులు లేని తెలంగాణను ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పథక రచన చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy) ఆరోపించారు. ప్రభుత్వ భూముల అమ్మకంపై సీఎంకు ఆయన లేఖ రాశారు.

Komati Reddy Venkata reddy
కోమటిరెడ్డి వెంకటరెడ్డి

By

Published : Jun 11, 2021, 9:40 PM IST

సర్కారీ భూములు అమ్మాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ఆక్షేపించింది. ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెచ్చి భూములను అమ్ముతున్నారని, చివరకు రాష్ట్రాన్ని తనఖా పెడతారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy) విమర్శించారు.

జిల్లాకు వెయ్యి ఎక‌రాల చొప్పున 33 వేల ఎక‌రాల విలువైన ప్రభుత్వ భూముల‌ను తెగ‌న‌మ్మడానికి సిద్ధమ‌య్యారని కోమటిరెడ్డి సీఎం కేసీఆర్‌ (Cm Kcr)కు రాసిన లేఖలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూముల‌ను అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు కేసీఆర్ (Kcr) కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ భూముల‌ను కాపాడుకోలేక వాటిని అమ్ముకోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ వ్యవస్థ చేతిలో ఉంచుకుని భూములను కాపాడుకోలేని దుస్థితిలో ఉందని దుయ్యబట్టారు. భవిష్యత్ తరాలకు అప్పులను, ఆస్తులు లేని తెలంగాణను ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితికి కేసీఆర్ (Kcr) పథక రచన చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి:covid test: కరోనా టెస్టు సమయంలో ముక్కులో విరిగిన స్క్వాబ్

ABOUT THE AUTHOR

...view details