కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఔషధ నగరి (ఫార్మాసిటీ)ని రద్దు చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఔషధ నగరికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. సేకరించిన భూమిలో కాలుష్యరహిత పరిశ్రమలను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపత్రి గ్రామంలో ఔషధ నగరి భూ నిర్వాసితుల సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి హాజరయ్యారు. మేడిపల్లి, నానక్ నగర్, తాడిపత్రి గ్రామాల్లో భూములను పరిశీలించారు.
బంగారు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ది పొందిందని ఆరోపించారు. దేశంలో ఎక్కడ అనుమతివ్వని ఫార్మా సిటీకి రంగారెడ్డి జిల్లా ముచ్చర్లతో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం.. ప్రజల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఔషధ నగరిని ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల భూములన్నీ కాలుష్యమయమవుతాయని అభిప్రాయపడ్డారు.
అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దుచేస్తాం: కోమటిరెడ్డి ఇవీచూడండి:'ఆగస్టు 15లోపు కరోనా వ్యాక్సిన్ అసాధ్యం'