తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress vari deeksha: ముగిసిన వరి దీక్ష.. రైతులకు అండగా ఉంటామని భరోసా - vari deeksha latest news

ధర్నా చౌక్​ వద్ద కిసాన్​ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్ష(Congress vari deeksha) ముగిసింది. రైతులకు మద్దతుగా పార్టీ నేతలు రెండ్రోజుల దీక్ష చేశారు. పార్టీ సీనియర్​ నేత జానారెడ్డి.. నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా 9 తీర్మానాలు ప్రవేశ పెట్టిన నేతలు.. ధాన్యం కొనుగోలు చేసేవరకు రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్​ నేతలంతా ఐకమత్యంగా ముందుకు సాగాలని జానారెడ్డి సూచించారు.

vari deeksha
వరి దీక్ష

By

Published : Nov 28, 2021, 4:57 PM IST

Updated : Nov 28, 2021, 6:38 PM IST

Congress vari deeksha: వరి దీక్షతో రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలని.. పార్టీ​ సీనియర్ నేత జానారెడ్డి (jana reddy in congress vari deeksha)ఆశాభావం వ్యక్తం చేశారు. దీక్షకు సంఘీభావం తెలిపిన పార్టీలు, ప్రజాసంఘాలకు ధన్యవాదాలు తెలియజేశారు. హైదరాబాద్​లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్​ వద్ద కిసాన్​ కాంగ్రెస్​ చేపట్టిన రెండు రోజుల వరి దీక్ష ముగిసింది. జానారెడ్డి.. పార్టీ నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కాంగ్రెస్​ అనేక సమస్యలను పరిష్కరించిందని.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందని ఆయన అన్నారు. ఆహార భద్రత, అటవీ హక్కుల చట్టాలను కాంగ్రెస్​ పార్టీనే తెచ్చిందని గుర్తు చేశారు.

రైతులకు అండగా ఉంటామని నేతల భరోసా

బుద్ధి చెప్తారు

సమస్యలను పరిష్కరించడంలో భాజపా, తెరాస ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. ప్రజలు ఎప్పుడు అధికారం ఇస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పటి వరకు ప్రజల గోసను ప్రభుత్వానికి విన్నవిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపాన్ని నెడుతూ సమస్యను పక్క దరిపట్టిస్తున్నాయి. ప్రజలు ఆ రెండు పార్టీలను పక్కకు పెడతారు. కాంగ్రెస్ నేతలంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలి. - జానారెడ్డి, కాంగ్రెస్​ సీనియర్​ నేత

దీక్ష విరమణకు ముందుగా ఎంపీ కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి(mp komati reddy venkat reddy in Congress vari deeksha).. సీఎం కేసీఆర్​ను ఉద్దేశించి పలు విమర్శలు చేశారు. అసమర్థ ముఖ్యమంత్రిని ఏం చేసినా తప్పు లేదని అన్నారు. వరి వేస్తే ఉరి కాదని.. రైతులు మీ ప్రభుత్వానికి ఉరి వేస్తారని సీఎంనుద్దేశించి కోమటి రెడ్డి హెచ్చరించారు.

CONGRESS MP KOMATIREDDY: 'రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయి'

కలిసే పని చేస్తాం

చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా అందరం కలిసి పనిచేస్తాం. కాంగ్రెస్​లో మేమందరం పీసీసీ ప్రెసిడెంట్లమే. మాకు పదవులు ముఖ్యంకాదు. నా రక్తంలోనే కాంగ్రెస్‌ ఉంది. కేసీఆర్‌ సంపాదన నిజాంల కంటే ఎక్కువుంది. ఇంత దోపిడీదారుడిని ప్రజలు ఎక్కువ కాలం భరించొద్దని కోరుతున్నా. -కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి ఎంపీ

వెయ్యి మందితో దిల్లీ జంతర్‌ మంతర్ వద్ద దీక్ష చేస్తామని కోమటి రెడ్డి అన్నారు. ఈ దీక్షకు పార్టీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:Congress vari deeksha: వరి దీక్షలో రైతుల కోసం 9 తీర్మానాలు..

Last Updated : Nov 28, 2021, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details