తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో లాక్​డౌన్​ విధించేలా చూడాలని మోదీకి కోమటిరెడ్డి లేఖ - mp komati reddy venkat reddy letter to pm narendra modi

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా మరణాలు అధిక సంఖ్యలో ఉన్నాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే సీఎం కేసీఆర్​ తప్పుడు సలహాలు ఇస్తున్నారని ఆరోపించిన ఆయన.. రాష్ట్రంలో పరిస్థితులపై ప్రధాని మోదీకి లేఖ రాశారు.

komati reddy letter to pm modi
మోదీకి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి లేఖ

By

Published : May 10, 2021, 10:56 PM IST

రాష్ట్రంలో మూడు వారాల పాటు లాక్‌డౌన్‌ విధించేలా చూడాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయని, మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిగితా రాష్ట్రాల కంటే తెలంగాణలో మరణాలు అధికంగా ఉన్నాయని లేఖలో తెలిపారు.

కొవిడ్‌ మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఇస్తోందని వెంకట్​రెడ్డి ఆరోపించారు. వ్యాక్సిన్ కొరత ఉన్నందున, రాష్ట్రానికి వ్యాక్సిన్ కోటా పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్‌ కొరతతో కింగ్‌ కోటి ఆస్పత్రిలో ఆదివారం ఏడుగురు కొవిడ్‌ బాధితులు మరణించినట్లు వివరించారు.

ఇదీ చదవండి:కరోనా పరిస్థితిపై హైకోర్టులో రేపు అత్యవసర విచారణ

ABOUT THE AUTHOR

...view details