యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం కదిరెనిగూడెం గ్రామానికి చెందిన నలమాస అశోక్(32)తాటి చెట్టుపై నుంచి కిందపడ్డాడు. 15 రోజులుగా చికిత్స పొందుతూ ఈరోజేమృతి చెందాడు. ఆరు నెలల క్రితమే అతని భార్య కూడా మరణించడంతో ముగ్గురు ఆడబిడ్డలు అనాథలయ్యారు. వారి పరిస్థితిని చూసి చలించిపోయిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మానవతా దృక్పథంతో లక్ష రూపాయల నగదు వారికి అందజేశారు.
MP Komati Reddy: ఎంపీ కోమటిరెడ్డి దాతృత్వం.. అనాథలైన చిన్నారులకు లక్ష సాయం - గీత కార్మికుని కుటుంబానికి సాయం
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ముగ్గురు ఆడబిడ్డలకు ఆర్థికసాయం అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం కదిరెనిగూడెం గ్రామానికి చెందిన ఓ గీత కార్మికుడు తాటి చెట్టుపై నుంచి పడి కోలుకోలేక మృతి చెందాడు.
కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆర్థిక సాయం
ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్, జడ్పీటీసీ నరేందర్ గుప్తా, మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి, సర్పంచ్ జన్నాయి కోడే నగేశ్, స్థానిక సర్పంచ్ పాండు, వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్ధులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియాదే'