తెలంగాణ

telangana

ETV Bharat / state

వచ్చే ఎన్నికల్లో వారికి సీటిస్తే నేను పని చేయను: కేశినేని నాని - Keshineni made important comments on Chinna

MP Kesineni Nani : వచ్చే ఎన్నికల్లో కేశినేని చిన్నాకు సీటు ఇస్తే పని చేయబోనని ఆయన సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. పార్టీలో ఎవరైనా పని చేయవచ్చని, ఇందులో అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే చిన్నాతో పాటు మరో ముగ్గురికి సీటు ఇస్తే మాత్రం సహకరించబోనని చెప్పారు.

కేశినేని నాని
కేశినేని నాని

By

Published : Jan 15, 2023, 5:24 PM IST

MP Kesineni Nani : ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీ దివంగత నాయకుడు కొంగర కాళేశ్వరరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరై చిత్రపటానికి పూలమాలలు లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ పోటీ చేసే అవకాశం ఉందని, పోటీ దారుడిగా ఉండవచ్చని, సీటు ఆశించవచ్చన్నారు. మహాత్మా గాంధీ లాంటి మహానుభావుడైనా, క్రిమినల్స్ కూడా పోటీ చేయొచ్చని చెప్పారు.

నందిగామ నియోజకవర్గంలో కేశినేని శివనాథ్ (చిన్నా) యాక్టివ్​గా ఉన్నారని, మీరు యాక్టివ్​గా లేరని విషయాన్ని ప్రశ్నించగా పార్టీలో ఎవరైనా యాక్టివ్​గా ఉండొచ్చు.. ఎవరైనా పని చేసుకునే అవకాశం ఉంది. కేశినేని శివనాధ్​కు సీటు ఇస్తే మీరు సహకరిస్తారా అని ప్రశ్నించగా.. చస్తే చేయనని స్పష్టం చేశారు. క్రిమినల్స్​కు, ల్యాండ్ మాఫియా, కాల్ మాఫియా లాంటి వాళ్లకు టికెట్లు ఇస్తే ఎందుకు సహకరిస్తామని ఎదురు ప్రశ్నించారు. తమ తమ్ముడుతో పాటు మరో ముగ్గురుకి సీటు ఇస్తే తాను ఎటువంటి పరిస్థితుల్లోనూ సహకరించనని వెల్లడించారు. పార్టీ సీట్లు ఇచ్చే విషయం అధిష్టాన నిర్ణయం ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు.

నేను కింది స్థాయి నాయకుడిని. రఘురామ్ గారు గొప్ప నాయకుడు. మా సేవలు పార్టీ ఎక్కడ కాబడితే అక్కడ వాడుకోవచ్చు. నేను ఎంపీ అయితేనే ఈ స్థాయి రాలేదు. నాకు ఒక బ్రాండ్ ఉంది. ఎంపీ కాకపోతే ఎక్కువ సేవ చేయవచ్చేమో. 100 ట్రస్ట్​లు పెట్టి సేవ చేయవచ్చు. పార్టీకీ సిద్దాంతాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మోసాలు, పేకాట క్లబ్ నడిపేవాళ్లని ఇంకా ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్లను సపోర్టు చేయను. నేను రాజకీయాలకు రావడానికి నాకు క్లారిటీ ఉంది. నేను ఎవ్వరిని మోసం చేయలేదు, చేయను. అలాంటి వారికి సపోర్టు చేయను. అలాంటి వారు ముగ్గురు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రక్షాళన కావాలని నా కోరిక. అతనే కాదు అలాంటి వారికి ఎవ్వరికి టికెట్ ఇచ్చినా నేను పని చేయను. - ఎంపీ కేశినేని నాని

కేశినేని చిన్నాకు సీటిస్తే పనిచేయను అంటున్న కేశినేని నాని

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details