తెలంగాణ

telangana

ETV Bharat / state

KK at parliament: పంటల సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలి: కేశవరావు

KK on Central govt: రాష్ట్రంలో ప్రస్తుతం అత్యంత దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయని రాజ్యసభ ఎంపీ కేశవరావు అన్నారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని విమర్శించారు. తెలంగాణ నుంచి ఎంత ధాన్యం సేకరిస్తారో కేంద్రం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

MP keshava rao
పార్లమెంట్ వద్ద మాట్లాడుతున్న రాజ్యసభ ఎంపీ కేశవరావు

By

Published : Nov 29, 2021, 3:56 PM IST

Updated : Nov 29, 2021, 4:49 PM IST

కేంద్రం పంటల సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలని రాజ్యసభ ఎంపీ కేశవరావు(MP keshavarao at parliament) డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎంత ధాన్యం సేకరిస్తారో స్పష్టం చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో రెండు పంటలు పండుతున్నా కూడా ప్రస్తుతం దుర్భర పరిస్థితి నెలకొందన్నారు. రబీ వరిని బాయిల్డ్ రైస్‌గా చేసి కేంద్రానికి ఇస్తున్నామని తెలిపారు. ఏ పంటలు వేయాలో అధ్యయనం చేస్తూ పంట సామర్థ్యం పెంచినట్లు పేర్కొన్నారు. రైతులు 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని వెల్లడించారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని కేకే(MP KK comments central govt) విమర్శించారు.

రాజ్యసభ ఎంపీ కేశవరావు

కేంద్రం స్పష్టత ఇవ్వాలి

గతంలో కేంద్ర ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని చెప్పిందని కేశవరావు(MP keshava rao on paddy procurement in telangana) అన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పష్టత ఇస్తే పంట మార్పిడిపై రైతులకు వివరిస్తామని తెలిపారు. సమయం ఇస్తే పంట మార్పిడి వైపు రైతులు మళ్లుతారని పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు. వరి పంట ఉత్పత్తి పెంచడమే కేసీఆర్ చేసిన తప్పా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపకూడదన్నారు. రాష్ట్రానికి సంబంధించి నాలుగు డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని ఆయన కోరారు. పార్లమెంట్‌లో గందరగోళం సృష్టించే ఉద్దేశం తమకు లేదని ఎంపీ కేశవరావు స్పష్టం చేశారు.

కేసీఆర్ చేసిన తప్పేంటి? ప్రతి ఎకరానికి నీళ్లివ్వడమా? పంట ఉత్పత్తిని పెంచడమా? కేంద్రాన్ని మేం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ తీసుకురండి. ఖరీఫ్ పంటకు ఓ టార్గెట్ పెట్టండి. మేం ఒక కోటి అన్నాము. మీరు ఎంత ధాన్యం సేకరిస్తారో చెప్పండి. ప్రస్తుతం రాష్ట్రంలో పంట ఉత్పత్తి పెరిగింది. మీరు ఎంత కొంటారో చెబితే మేం రైతులకు వివరిస్తాం- కేశవరావు, రాజ్యసభ ఎంపీ

పార్లమెంట్‌లో ఎంపీల ఆందోళన

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం కాాగా.. తెరాస ఎంపీలు ఆందోళనకు(MPS protest at parilament) దిగారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోక్​సభలో తెరాస స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి.. రైతు సమస్యలపై చర్చించాలని వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. పార్లమెంట్​లో తొలిరోజే ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యం మొదలు కాగానే.. ధాన్యం కొనుగోళ్లపై తెరాస ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తోసిపుచ్చారు. దీంతో తెరాస ఎంపీలు ఆందోళనకు దిగారు. ఎంపీ నామ నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలో తెరాస స‌భ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను కొద్దిసేపు వాయిదా వేశారు. ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం ఎంపీలు సెంట్రల్ హాల్​లో ప్లకార్డులు ప్రదర్శించారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు.

ఇదీ చూడండి:

trs mps dharna in loksabha: ధాన్యం కొనుగోళ్లపై చర్చకు పట్టు.. లోక్‌స‌భ‌లో తెరాస ఎంపీల ఆందోళ‌న‌..

Last Updated : Nov 29, 2021, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details