తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు కేశవరావు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరులను స్మరించుకున్నారు. అనంతరం తెరాస భవన్లోని తెలంగాణ సిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి అంజలి ఘటించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు దేవుడిచ్చిన వరమని కేశవరావు వ్యాఖ్యానించారు. ఆయన జాతీయ నేతగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం' - telangana formation day latest news
కరోనా నేపథ్యంలో సంబురాలను నిరాడంబరంగా జరుపుకున్నారు. తెలంగాణ భవన్‌లో రాజ్యసభ సభ్యులు కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు దేవుడిచ్చిన వరమని కొనియాడారు..
'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం'